: విమానంలో నుంచి ఓ వ్యక్తిని బిల్డింగ్ పైకి విసిరేశారు!
గాల్లో వెళుతున్న విమానంలో నుంచి ఓ వ్యక్తిని కిందనున్న బిల్డింగ్ పైకి విసిరేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటన మెక్సికోలోని ఎల్డొరాడో నగరంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో డ్రగ్స్ అక్రమ రవాణా ఎక్కువగా ఉంటుంది. విమానం నుంచి ఓ వ్యక్తి శరీరం ఐఎమ్ఎస్ఎస్ ఆసుపత్రి మీద పడిందని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి తెలిపాడు. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చి, చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఆ వ్యక్తిని చంపేసి కిందకు పడేశారా? లేక ప్రాణాలతోనే కిందకు తోసేశారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఘటన జరిగిన సినోలా రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాల మధ్య నిరంతరం దాడులు, ప్రతి దాడులు జరుగుతుంటాయి.