: వాచీ లేదు, ఉంగరం లేదు అని చెప్పుకునే చంద్రబాబు ఇల్లెలా కట్టారు?: రోజా


వైసీపీ ఎమ్మెల్యే రోజా నేడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం, గుడి వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చేతికి వాచి, ఉంగరం కూడా లేదని చెప్పుకునే చంద్రబాబు... విలాసవంతమైన ఇంటిని ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు. పట్టిసీమ, అమరావతి నిర్మాణం పేరుతో దోచుకున్న డబ్బుతోనే ఆయన ఇంటిని నిర్మించుకున్నారని విమర్శించారు. తన కుమారుడు లోకేష్ కు ఉద్యోగం ఇస్తే రాష్ట్రంలోని యువతకంతా ఉద్యోగాలు ఇచ్చినట్టు చంద్రబాబు ఫీల్ అవుతున్నారని అన్నారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని తెలిపారు. అప్పటి వైశ్రాయ్ హోటల్ రాజకీయాల నుంచి నేటి వరకు చంద్రబాబు నీచ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News