: రిజర్వేషన్ల పెంపును చట్టం చేసి పంపుతాం.. కేంద్రం కాదంటే యుద్ధమే: కేసీఆర్
ఎస్టీ, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీ కమిషన్ ఒక నివేదిక ఇచ్చిందని... కేబినెట్ లో దాన్ని ఆమోదించామని చెప్పారు. బిల్లు తయారు చేయాలని న్యాయ శాఖ కార్యదర్శిని ఆదేశించామని... 15వ తేదీన ఎస్టీ, ముస్లింలకు ఎంతెంత శాతం రిజర్వేషన్లు ఉండాలనే విషయాన్ని ఖరారు చేస్తామని చెప్పారు. ఎస్సీల రిజర్వేషన్లను కూడా ఒక శాతం పెంచుతామని తెలిపారు. 16వ తేదీన శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తామని చెప్పారు. ఈ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే యుద్ధం తప్పదని, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతామని కేసీఆర్ అన్నారు.