: ఈ నెల 24న ముఖ్యమంత్రులతో కేంద్రం సమావేశం


ఈ నెల 24వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తోంది. వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) నమూనా చట్టం ముసాయిదాలో మార్పులు, చేర్పుల ఖరారు కోసం ఈ సమావేశాన్ని నిర్వహించబోతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి అశోక్ దల్వాయ్ ఈ వివరాలను మీడియాకు చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతోనే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఈ ముసాయిదాకు సంబంధించి ఇప్పటికే రైతులు సహా సంబంధిత వర్గాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయాలు, సూచనలను తీసుకుంది. తమ ఉత్పత్తులను మంచి ధరకు అమ్ముకునేలా రైతులకు పూర్తి స్వేచ్ఛను ఈ ముసాయిదా కల్పిస్తోంది. 

  • Loading...

More Telugu News