: విమానంలో బికినీతో ఎయిర్ హోస్టెస్ లు... పెరిగిన గిరాకీ!
సినిమాల్లో హీరోయిన్లు బికినీ వేస్తే ఆ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుందని నిర్మాతలు భావిస్తారు. అలాగే బికినీ వేర్ ఫ్యాషన్ షోకు విశేషమైన ఆదరణ ఉంటుందని ఫ్యాషన్ నిపుణులు చెబుతుంటారు. అలాగే విమానాల్లో ఎయిర్ హోస్టెస్ లు కూడా బికినీలలో కనిపిస్తే గిరాకీ పెరుగుతుందని వియత్నాంకు చెందిన వియత జెట్ అనే ఎయిర్ లైన్స్ నిరూపిస్తోంది. ఇతర ఎయిర్ లైన్స్ కు భిన్నంగా తమ విమానాల్లో సేవలందించే ఎయిర్ హోస్టెస్ లు బికినీ లేదా షర్టు-షార్ట్స్‌లో విధులకు హాజరుకావొచ్చని ఆ సంస్థ యజమాని ఎమ్‌ఎస్.థావో ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ఎయిర్ లైన్స్ కు ప్రయాణికులు విశేషంగా పెరిగిపోయారు.
అయితే ఈ ఆదేశాలు కేవలం బీచ్ లకు వెళ్లే విమానాలలో పనిచేసే సిబ్బందికి మాత్రమే వర్తిస్తుందని ఆయన ఆదేశాల్లో పేర్కొనడంతో...ఈ విమానాల్లో ఎయిర్ హోస్టెస్ లు టూపీస్ బికినీల్లో దర్శనమిస్తున్నారట. 2011లో ఈ ఎయిర్ లైన్స్ యజమాని ఏకంగా ఎయిర్ హోస్టెస్ లతో ఫ్యాషన్ షూట్ చేయటమే కాకుండా, విమానంలో బికినీ షో చేయించారు. దీంతో వియత జెట్ ఎయిర్ లైన్స్ లక్ష్యం నెరవేరింది. ఈ సంస్థకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు వచ్చేశాయి. మరోపక్క, డ్రెస్ కోడ్ ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ విమాన సంస్థల బోర్డు 2012లో వియత జెట్ ఎయిర్ లైన్స్ పై జరిమానా విధించింది.
దీంతో ఈ ఎయిర్ లైన్స్ క్రెడిబులిటీ దెబ్బతింటుందని, ప్రయాణికులు తగ్గిపోతారని అంతా భావించగా, ఎవరూ ఊహించని విధంగా ఈ ఎయిర్ లైన్స్ కు డిమాండ్ పెరిగింది. అంతే కాకుండా దీనిని ‘బికినీ ఎయిర్ లైన్స్’ అంటూ అంతా ముద్దుగా పిలుచుకోవడం విశేషం. ఈ ఎయిర్ లైన్స్ బికినీ ఎయిర్ హోస్టెస్ ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.