: మంత్రి, ఎమ్మెల్యే రోజు కూలీ 3 లక్షల రూపాయలు!
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు కూలిపని చేసి డబ్బులు సంపాదిస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మంత్రి జగదీశ్ రెడ్డి మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో హమాలీ అవతారమెత్తారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి విస్తా ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, ఐడియల్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆయన బస్తా మూటలు మోశారు. దీంతో ప్రజా ప్రతినిధుల కష్టానికి విస్తా కంపెనీ లక్ష రూపాయలు, ఐడియల్ సంస్థ 2 లక్షల రూపాయలు ముట్టజెప్పాయి.