: ‘జియో’పై మళ్లీ ‘ట్రాయ్’ కెక్కిన ఎయిర్‌టెల్!


రిలయన్స్ జియోపై టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మరోమారు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ను ఆశ్రయించింది. జియో ఎత్తుగడలను అడ్డుకోవాలని కోరింది. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను రద్దు చేసిన జియో ఇటీవల ప్రకటించిన ‘ధన్ ధనా ధన్’ ఆఫర్ కొత్త సీసాలో పాత నీరు లాంటిదని వ్యాఖ్యానించింది. పేరు మార్చి దానినే కొనసాగిస్తోందని, అడ్డుకోవాలని కోరింది. పేర్లు వేరైనా ఆఫర్‌లో తేడా లేదని వాదిస్తోంది. ‘ధన్ ధనా ధన్’ అంటే హిందీలో ‘డబ్బు డబ్బు డబ్బు’ అని అర్థం వచ్చేలా ఉందని, ట్రాయ్ మార్గదర్శకాల స్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధమని ఎయిర్‌టెల్ పేర్కొంది. కాగా, సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ ట్రాయ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ దానిని నిలిపివేయాల్సిందిగా ఇటీవల ట్రాయ్ ఆదేశించింది. దీంతో ఆ ఆఫర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన జియో అంతలోనే ‘ధన్  ధనా ధన్’ ఆఫర్‌ను ప్రకటించింది.

  • Loading...

More Telugu News