: అక్షరాలా దేవుడే.. మహేష్ బాబు ఫస్ట్ లుక్ పై రాంగోపాల్ వర్మ ట్వీట్


మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ రోజు ఆ సినిమా యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మ‌హేష్ స్టైల్‌కి వివాదాస్పద‌ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఫిదా అయిపోయాడు. మ‌హేష్ బాబు దేవుడిలా ఉన్నాడ‌ని పేర్కొన్నాడు. ‘అద్భుతంగా ఉంది, మహేష్‌ అక్షరాలా దేవుడిలా ఉన్నాడు’ అని రాంగోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నాడు. స్పైడ‌ర్ విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని కూడా ఆయ‌న షేర్ చేశాడు. మ‌రోవైపు ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు స‌మాచారం. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.
<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Simply Amazing..Mahesh is literally looking like God<a href="https://t.co/TfkdgaJYQB">pic.twitter.com/TfkdgaJYQB</a></p>— Ram Gopal Varma (@RGVzoomin) <a href="https://twitter.com/RGVzoomin/status/852126835915739137">April 12, 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

  • Loading...

More Telugu News