: కుల్ భూషణ్ కు ఉరిశిక్ష విషయంలో వెనక్కి తగ్గని పాకిస్థాన్!


భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌కు పాక్ ఆర్మీ కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించిన అంశంపై భార‌త్ నుంచి ఎన్నో అభ్యంత‌రాలు, హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ పాకిస్థాన్ ప్ర‌భుత్వం వెన‌క్క‌త‌గ్గకుండా మొండి వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తోంది. కుల్‌భూషణ్‌ కు ఉరిశిక్ష అమలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్‌ హెచ్చరించిన నేపథ్యంలో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఈ రోజు త‌మ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్ జావెద్ బజ్వాతో స‌మావేశం నిర్వ‌హించారు. కుల్‌భూష‌ణ్‌కు విధించిన శిక్ష విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగరాదని వారు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అక్క‌డి మీడియా పేర్కొంది. కుల్‌భూష‌ణ్ కు ఉరిశిక్ష అంశంతో ఇరు దేశాల మ‌ధ్య మ‌రోసారి విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. 

  • Loading...

More Telugu News