: ఏపీ వాసులకు శుభవార్త.. ‘విశాఖ’లో పెట్రో యూనివర్శిటీకి కేంద్రం ఆమోదం


విశాఖపట్టణంలో పెట్రోలియం, ఇంధన వర్శిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. విశాఖలో రూ.655.46 కోట్ల పెట్టుబడితో ఈ వర్శిటీని ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది. కాగా, పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా ఈ వర్శిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ యూనివర్శిటీ ద్వారా పెట్రోలియం విభాగంలో నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, పరిశోధనలకు అవకాశం  ఏర్పడుతుంది. అంతేకాకుండా, కేజీ బేసిన్, విశాఖలో ఏర్పాటు చేస్తున్న రిఫైనరీకి, కాకినాడలో ఏర్పాటు చేయబోయే పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కు ఈ యూనివర్శిటీని అనుసంధానం చేస్తారు.  

  • Loading...

More Telugu News