: ఎలిజబెత్ రాణి కొత్త బూట్లను ముందుగా ధరించేది ‘ఫుట్ విమెన్’!


బ్రిటన్ ఎలిజబెత్ రాణి-2 ధరించే బూట్లు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసేందుకు ఓ ఉద్యోగి ఉంటారట. ఆ ఉద్యోగి చెక్ చేసి, వాటిని కొన్ని రోజుల పాటు ధరించి ‘ఓకే’ చెప్పిన తర్వాత రాణి గారు ధరిస్తారు. అలా ఎందుకు చేయడమనే ప్రశ్నకు రాణి వద్ద పని చేసే డిజైనర్ స్టీవర్ట్ పర్విన్ సమాధానమిస్తూ, రాణి తన అధికారిక నివాసమైన బకింగ్ హామ్ ప్యాలెస్ లో నడుస్తున్నప్పుడు బూట్లు సరిగా లేకపోవడంతో పడిపోతారన్న భయంతో ‘ఫుట్ విమెన్’ని నియమించినట్టు చెప్పారు. రాణి కొత్త బూట్లను ఆమె ధరించడానికంటే ముందు ‘ఫుట్ విమెన్’ ధరిస్తారని, వాటిని ధరించి ప్యాలెస్ లో కొన్ని రోజుల పాటు ఆమె నడుస్తారని చెప్పారు. ఆ తర్వాతే ఆ బూట్లను రాణిగారు ధరిస్తారని స్టీవర్ పర్విన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News