: కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కాసేపట్లో కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల పెంపునకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. అలాగే, బీసీ కమిషన్, సుధీర్, చెల్లప్ప కమిషన్ల నివేదికలు, నూతన వారసత్వ చట్టం, ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ పునరుద్ధరణ వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. వాటిపై తీసుకున్న నిర్ణయాలు, త్వరలో నిర్వహించాలనుకుంటున్న అసెంబ్లీ సమావేశాల తేదీల వంటి వాటిపై సీఎం ప్రకటన చేయనున్నట్లు సమాచారం.