: మమతపై రివార్డు ప్రకటించిన ఆ నేత తల నరికితెస్తే రెట్టింపు నజరానా ఇస్తా!: ఓ ముస్లిం మతగురువు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తల నరికిన వారికి రూ.11 లక్షల నజరానా ఇస్తానంటూ బీజేపీ యువ మోర్చా నేత యోగేష్ వార్ష్నీ చేసిన వ్యాఖ్యలపై కోల్ కతా టిప్పు సుల్తాన్ షాహీ మసీద్ ఇమామ్ రెహ్మాన్ బర్కతీ ఘాటుగా స్పందించారు. సీఎం తలపై యోగేష్ వార్ష్నీరివార్డు ప్రకటిస్తాడా? అంటూ మండిపడ్డారు. యోగేష్ తల నరికి తెచ్చిన వారికి రూ.11 లక్షలకు రెట్టింపు నజరానా ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ అంటే తమకు ఎంతో గౌరవమని, ఆమెను తన సోదరిగా భావిస్తానని, అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేసిన యోగేశ్ వార్ష్నీ తల నరికి తెచ్చిన వారికి రూ.22 లక్షల నజరానా ఇస్తానని ప్రకటించారు.