: ఈ నెల 15 నుంచి జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు

నీరు - ప్రగతి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 15 నుంచి జులై 15 వరకు పలు జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని సమాచారం. ఈ నెల 15న కర్నూలులో నీరు - ప్రగతి కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు.ఆయా జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు, పార్టీ పటిష్టతపై కూడా ముఖ్యమంత్రి దృష్టిసారిస్తారు.