: ఎట్ట‌కేల‌కు మ‌హేష్‌బాబు కొత్త సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌.. అదుర్స్ అంటున్న అభిమానులు!


టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక‌రైన‌ మహేష్ బాబు కొత్త సినిమా ఫ‌స్ట్‌లుక్ కోసం ఆయ‌న అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై చివ‌ర‌కు మ‌హేష్ బాబు కూడా స్పందించి త‌న ఫస్ట్‌లుక్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని అభిమానులు కాస్త ఓపిక ప‌ట్టాల‌ని ఇటీవలే ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మ‌హేష్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ ను చిత్ర యూనిట్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేసింది. ఈ లుక్‌లో మ‌హేష్ క‌న‌ప‌డుతున్న తీరు అదుర్స్ అనిపిస్తోంది. మహేష్ ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు స్పైడర్ అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న‌ రకుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  




  • Loading...

More Telugu News