: మూడు బీర్లు లాగించిన వరాహం!


వరాహం ఎంచక్కా బీరు కొట్టేసింది. అది కూడా, ఒకటో రెండో కాదు, ఏకంగా మూడు బీర్లు అవలీలగా తాగేసింది. మెక్సికోలో చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి చెప్పాలంటే.. ఓ పంది అక్కడి బార్ బయట తిరుగాడుతూ, అక్కడ పడేసి ఉన్న బీరు సీసాలను తన నోట్లో పెట్టుకుని తన దాహం తీర్చుకోవాలని అనుకుంది. కానీ, వాటిలో, ఓ చుక్క బీరు కూడా లేకపోవడంతో నిరాశ చెందింది. అయితే, ఓ వ్యక్తి తాను తాగేందుకు పక్కనే పెట్టుకున్న బీర్ బాటిల్ పై ఈ వరాహం కన్ను పడింది.

అంతే, అమాంతం, ఆ బాటిల్ ను లాక్కుని తాగేసింది. అయితే, దాహం తీరకో, బీరు రుచి మరిగో కానీ, మరో సీసా కోసం అక్కడ వెదుకులాడింది. ఇది గమనించిన అక్కడి వారు మరో రెండు బీర్ బాటిల్స్ కొనుగోలు చేసి, దాని ముందు పెట్టడంతో, ఒక దాని తర్వాత మరోటి తాగేయడం ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో స్థానికులు తీశారు. ఈ వీడియో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News