: మీరు అధికారంలోకి వచ్చాకే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి: ట్రంప్ పై పుతిన్ ధ్వజం


అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమ‌ర్శ‌లు చేశారు. అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన నేప‌థ్యంలో అమెరికా, ర‌ష్యాల మ‌ధ్య స‌త్సంబంధాలు మెరుగవుతాయ‌ని అంతా అనుకున్నారు. కానీ, అటువంటి ప‌రిస్థితి ఏర్ప‌డే అవ‌కాశాలు ఏమీ లేవ‌ని పుతిన్ తేల్చి చెప్పారు. అంతేగాక‌, ట్రంప్ అధికారం చేప‌ట్టిన త‌రువాత ఇరు దేశాల మ‌ధ్య‌ సంబంధాలు దరిద్రంగా తయారయ్యాయని ఆయన అన్నారు.

సిరియా సైన్యం ర‌సాయ‌న దాడి చేసిందంటూ అమెరికా ఆ దేశంలోని షైర‌త్ వైమానిక స్థావ‌రంపై దాడి చేసిన అంశంపై పుతిన్ ఓ ఇంట‌ర్వ్యూలో స్పందిస్తూ...  అసలు సిరియా ఎప్పుడో తన రసాయన ఆయుధాలను వదిలిపెట్టేసిందని, ఇక ఆ తరహా దాడి చేసే అవకాశం ఎక్కడ ఉంటుందని అన్నారు.

తిరుగుబాటుదారుల వద్ద ఉన్న రసాయన ఆయుధాల నిల్వలపై ఆ దేశ‌ ప్రభుత్వం వైమానిక దాడులు చేసి ఉంటుందని, ఆ కార‌ణంగానే అక్కడి విషవాయువులు వ్యాపించి ప్రజలు మరణించి ఉండ‌వ‌చ్చ‌ని పుతిన్ వ్యాఖ్యానించారు. సిరియా ప్రభుత్వంపై ర‌సాయ‌న దాడి ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ ఆ ఘటనను ఆమెరికా ఉపయోగించుకుంద‌ని ఆయ‌న ఆరోపించారు.

  • Loading...

More Telugu News