: హైదరాబాదులో ‘రూ.5 కే భోజనం’ కొనుక్కుని రుచి చూసిన వైసీపీ ఎమ్మెల్యే!


హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర‍్యంలో హరే కృష్ణ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న భోజన కేంద్రానికి ఈ రోజు ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్లారు. అక్క‌డ రూ.5 కే భోజ‌నం అందిస్తున్న తీరును ప‌రిశీలించారు. సామాన్యుడిలా క్యూ లైన్‌లో నిల్చుని భోజన సదుపాయాలు తెలుసుకున్న రామకృష్ణారెడ్డి.. అనంతరం అక్కడే భోజనం కొనుక్కొని తిన్నారు. తెలంగాణలో చేప‌డుతున్న‌ ఈ కార్యక్రమంపై ఆయ‌న ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తన నియోజక వర్గం మంగళగిరిలోనూ ఇలాంటి కార్యక్రమంతో సొంతంగా పేదలకు భోజనం పెట్టాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. అందుకోసం తాను రూ.5 భోజన పథకాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News