: అందుకే జాకీచాన్ కు బలవంతంగా పెళ్లి చేశారట!


ప్రముఖ నటుడు జాకీచాన్ కు ఆయన తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 1982లో జోవాన్ లిన్ తో జాకీ ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో, వద్దంటున్నా జాకీ తల్లిదండ్రులు అతనికి ఆమెతో పెళ్లి చేశారు. వాస్తవానికి చాకీచాన్ కు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదట. మరోవైపు, వీరిద్దరి పెళ్లి కూడా చాలా విచిత్రంగా... లాస్ ఏంజెలెస్ లోని ఓ కాఫీ షాప్ ఎదుట జరిగింది. మరో విషయం ఏమిటంటే, అప్పట్లో చాలా మంది మహిళలతో జాకీకి సంబంధాలు ఉండేవట. ఈ విషయాన్ని కూడా ఆయనే స్వయంగా చెప్పారు. 'కుంగ్ ఫూ యోగా' అనే సినిమాలో ఇటీవల జాకీ నటించారు. 

  • Loading...

More Telugu News