: సముద్ర జలాల్లో జరిగిన వేడుకల్లో ఇదే పెద్దది.. అత్యంత ఖరీదైన నౌకలో ఘనంగా వివాహం!

తమ పెళ్లి వేడుక గుర్తుండిపోయేలా జ‌రుపుకోవాల‌ని ప్రతి అబ్బాయి, అమ్మాయి కోరుకుంటారు. త‌మ పిల్ల‌ల పెళ్లి వీలైనంత ఘ‌నంగానే జ‌రిపించాల‌ని త‌ల్లిదండ్రులు అనుకుంటారు. ఆకాశ‌మంత పందిరి వేసి, నోరూరించే ఎన్నోర‌కాల‌ వంట‌కాలు చేయించి, బంధుమిత్రులంద‌రినీ పిలిచి పెళ్లి జ‌రిపించాల‌ని, ఆ పెళ్లి గురించి అంతా గొప్ప‌గా చెప్పుకోవాల‌ని భావిస్తారు. అయితే, దుబాయ్‌కి చెందిన నిర్మాణ సంస్థ డనుబే గ్రూప్ చైర్మన్ సజన్ తన కొడుకు అడేల్, కోడలు సనా వివాహం జ‌రిపించిన తీరు నిజంగానే త‌ర‌త‌రాలు గుర్తు పెట్టుకునేలా ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, అత్యంత ఖరీదైన నౌకల్లో ఒకటైన ‘ది లవ్ షిప్’లో త‌న కొడుకు వివాహాన్ని అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిపించాడు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పెళ్లి వేడుక‌కి 194 కోట్ల రూపాయలు ఖ‌ర్చ‌య్యాయి.

ఆ నౌకలో 5 రెస్టారెంట్లు, 13 బార్లు, 4డీ సినిమా హాలు, గ్రాండ్ ఫిక్స్ డ్రైవింగ్ సిమ్యులేటర్ ఉంటాయి. పెళ్లికి వ‌చ్చిన‌ ప్రతి అతిథికి ఓ ప్రత్యేకమైన గది కూడా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వంటకాలను వండించారు. అందుకోసం 75 మంది ప్రత్యేకమైన వంట మాస్టర్లను పిలిపించారు. ఈ పెళ్లి వేడుక‌కి భారత్, యుఏఈ నుంచి సుమారు 1200 మంది అతిథులు హాజరయ్యారు. భారత్ నుంచి సుస్మితాసేన్, జూహీ చావ్లా, సోఫీయా చౌదరి, షిల్పా శెట్టి వంటి వారు హాజ‌ర‌య్యారు. పెళ్లికొడుకు తాను ప్రేమించిన అమ్మాయిని చివ‌ర‌కు ఇలా అత్యంత ఘ‌నంగా పెళ్లి చేసుకున్నాడు.  కోస్టా జలప్రయాణం అధ్యక్షుడు నీల్ పలోంబా ఈ పెళ్లి వేడుక‌పై స్పందిస్తూ స‌ముద్ర జలాల్లో ఓ కుటుంబానికి సంబంధించి జరిగిన వేడుకల్లో ఇదే పెద్దదని అన్నారు.

1 day to go #sanadel

A post shared by Adel Sajan (@adelsajan) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-04-05T06:05:38+00:00">Apr 4, 2017 at 11:05pm PDT</time>

• Loading...

More Telugu News