: 'వంగవీటి' సినిమా వివాదంలో.. కోర్టుకు హాజరుకానున్న వంగవీటి రాధా
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'వంగవీటి' సినిమా పంచాయితీ కోర్టుకు చేరింది. వర్మపై వంగవీటి మోహనరంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా విజయవాడలోని స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, సహ నిర్మాత సుధీర్ చంద్రలను చేర్చుతూ పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబాన్ని కించపరిచేలా ఈ సినిమాను తెరకెక్కించారంటూ పిటిషన్ లో రాధా ఆరోపించారు. ఈ నేపథ్యంలో, కాసేపట్లో కోర్టుకు ఆయన హజరుకానున్నారు.