: లేవగానే టీ ఇవ్వలేదని.. భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు!


కొన్ని హత్యలని చూస్తే, 'కారణం ఇదేనా? ఇంత చిన్న కారణానికే హత్యా?' అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని పౌరీ జిల్లాకు చెందిన సంగీత్ సింగ్ నేగీ (38), ఆర్తి (35) దంపతులకి పదమూడేళ్ల క్రితం వివాహమైంది. నిన్న ఉదయం నిద్రలేచిన సంగీత్ సింగ్... తన భార్యను బెడ్ టీ ఇవ్వమని ఆర్డర్ వేశాడు. దీంతో తాను టీ చేయనని ఆమె దురుసుగా సమాధానం చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సంగీత్ సింగ్...బెడ్ రూంలోకి కత్తులు, కత్తెర తీసుకెళ్లి భార్యను పిలిచాడు.

బెడ్ రూంలోకి భార్య రాగానే, తలుపుకు గడియపెట్టి, కత్తులతో విచక్షణా రహితంగా ఆమెను పొడిచాడు. ఆ సమయంలో ఆమె రక్షించమంటూ ఆర్తనాదాలు చేయడంతో, వేరే గదిలో ఉన్న పిల్లలు గట్టిగా ఏడ్చారు. చుట్టుపక్కల వారు చేరుకునే సరికే అతను పరారయ్యాడు.  దీంతో స్థానికుల ఫిర్యాదుతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి మధ్య విభేదాలు ఉన్నాయని, దీంతో తరచు ఘర్షణ పడుతుండేవారని, అతనికి వివాహేతర సంబంధం కూడా ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

  • Loading...

More Telugu News