: రాధిక, శరత్ కుమార్ లకు ఐటీ సమన్లు... విచారణకు హాజరు కావాలంటూ ఆదేశం
ప్రముఖ సినీ నటి రాధికకు చెందిన రాడాన్ కార్యాలయంలో ఇన్ కం ట్యాక్స్ అధికారుల సోదాలు ముగిశాయి. నిన్నటి నుంచి ఈ సోదాలు కొనసాగాయి. ఇప్పటికే ఆమె భర్త శరత్ కుమార్ కు చెందిన ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భారీగా డబ్బును పంచిన నేపథ్యంలో, శశికళ వర్గానికి చెందిన వీరిపై ఐటీ దాడులు జరిగాయి. ఈ క్రమంలో రాధిక, శరత్ కుమార్ లకు ఐటీ శాఖ సమన్లు పంపించింది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది.