: సమంతపై వస్తున్న పుకార్లు నిజం కాదు: సుకుమార్ చిత్రయూనిట్ ట్వీట్


సినీ నటి సమంతపై వస్తున్న వన్నీ పుకార్లేనని ఎస్వీసీసీ మూవీ మేకర్స్ తెలిపారు. ఎస్వీసీసీ బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత మూగ పాత్ర పోషిస్తోందని, రామ్ చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడని టాలీవుడ్ లో వార్తలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన చిత్రయూనిట్ ఈ సినిమాలో సమంత మూగ అమ్మాయిగా నటిస్తోందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రకటించింది. రామ్ చరణ్ పాత్రపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రామ్ చరణ్ పాత్ర చెవిటివాడిగా ఉండనుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ చేయనుందని కూడా వార్తలు వినపడుతున్నాయి. 80లలోని గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగిన సినిమాగా ఇది తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News