: మార్కెట్ షాక్ తో దిగివచ్చిన యునైటెడ్ ఎయిర్ లైన్స్... ప్రయాణికుడికి క్షమాపణలు!
షికాగో నుంచి లూయీస్ విల్లే వెళ్లే యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో తన ఊరుకు అత్యవసరంగా వెళ్లాలని, విమానంలో నిల్చుని అయినా సరే వెళ్తానని భీష్మించుకుని కూర్చున్న ఒక డాక్టర్ ను విమాన సిబ్బంది కాళ్లూ చేతులు పట్టుకుని లాగిపడేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ విమానయాన సంస్థ షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి.
షేర్ మార్కెట్ ఇంట్రా ట్రేడింగ్ లో ఆ సంస్థ షేర్లు 3.7 శాతం పతనమైపోయాయి. దీంతో ఒక్కసారిగా కంపెనీ మార్కెట్ విలువ 800 మిలియన్ డాలర్లు (5,100 కోట్ల రూపాయలకు పైగా) పడిపోయింది. దీంతో దిగి వచ్చిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ సదరు ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని తెలిపింది.