: రామ్ గోపాల్ వర్మ మారిపోయాడట.. ఇక ఎవర్నీ ఇబ్బంది పెట్టడట!


తన వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద పెద్ద స్టార్లను కూడా ఇబ్బంది పెట్టే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మారిపోయాడట. ఇకపై ఎవరినీ కష్టపెట్టే వ్యాఖ్యలను తాను చేయబోనని ఆయన తెలిపాడు. తాను దేవుడిని నమ్మను కాబట్టి.. తన మాటలను మీరు కూడా నమ్మరని... అందుకే మా అమ్మమీద, దర్శకుడు స్పీల్ బర్గ్ మీద, అమితాబ్ బచ్చన్ మీద ఒట్టేసి చెబుతున్నానంటూ ట్విట్టర్ లో చెప్పాడు.

ఇటీవలే, బాలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు అయిన విద్యుత్ జమాల్ ను, టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్ ను పోలుస్తూ వర్మ కొన్ని ట్వీట్లు చేశాడు. ఈ ట్వీట్లపై జమాల్ మండిపడ్డాడు. షావోలిన్ మాంక్ స్టైల్ ను మర్చిపోయి... వర్మ డ్రంకెన్ మాస్టర్ స్టైల్ ను ట్రై చేయండంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ ట్వీట్ తర్వాత వర్మ పూర్తిగా మారిపోయాడు. ఇకపై వివాదాస్పద ట్వీట్లు చేయనని చెప్పాడు. 

  • Loading...

More Telugu News