: రోడ్డు ప్రమాదానికి గురైన విమానం!
రన్ వే పై నుంచి విమానం పక్కకు జారిపోవడం, గాల్లో ఎగురుతున్న సమయంలో క్రాష్ కావడంలాంటి ప్రమాదాలను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ, ఈ విమానం మాత్రం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన అమెరికాలోని మానే రాష్ట్రంలో జరిగింది. నిన్న ఉదయం 10 గంటలకు గాల్లో ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో, విమానాన్ని నడుపుతున్న జాన్ గేలే ఓ రోడ్డు పైన దాన్ని ల్యాండ్ చేశాడు. విమానం రోడ్డు పైన సేఫ్ గానే ల్యాండ్ అయింది, కానీ, ఆ తర్వాత అదుపుతప్పింది. పక్కనే ఉన్న మెటల్ రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్ కు తీవ్ర గాయాలవగా, విమానంలోని ఓ ప్రయాణికుడు స్వల్పంగా గాయపడ్డాడు.