: 4 లీటర్ల నీటితో 160 కిలోమీటర్ల మైలేజీ... విషప్రయోగానికి గురైన ఆవిష్కర్త!
పెట్రోలు, డీజిల్ సమస్యను ముందుగానే అంచనా వేసిన ఓ ఔత్సాహికుడు చాలా కాలం క్రితమే నీటితో నడిచే కారును తయారు చేశారన్న సంగతి మీకు తెలుసా?... టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో 1986లో కెనడాకు చెందిన స్టాన్ మేయర్ అనే వ్యక్తి నీటితో నడిచే డ్యూన్ బగ్గీ అనే కారును రూపొందించారు. ఈ కారు కేవలం 4 లీటర్ల నీటితో 160 కిటోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని ఆయన నిరూపించారు. 1986లో స్టాన్ మేయర్ ఈ కారును విజయవంతంగా ప్రదర్శించారు. ఈ కారుకు ఆయన పేటెంట్ హక్కులను కూడా పొందారు.
అయితే ఆయనను ఈ పేటెంట్ హక్కులు అమ్మాల్సిందిగా పలువురు ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. దానికి ఆయన అంగీకరించకపోవడంతో 1998లో ఆయన విషప్రయోగానికి గురై మరణించారు. ఆయన హత్య తరువాత ఆయన అనుచరులు, సహచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో నీటితో నడిచే కారును తయారు చేసిన రహస్యం కూడా అంతమైంది. అప్పట్లో ఆయన కారును ప్రదర్శించిన వీడియోను మీరు కూడా చూడండి.