: 'ఐపీఎల్ 10'లో నమోదైన తొలి సెంచరీ... శతకం బాదిన సంజు శాంసన్


ఐపీఎల్ సీజన్ 10లో తొలి సెంచరీ నమోదైంది. అయితే ఈ సెంచరీ సాధించింది మాత్రం క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, డివిలియర్స్, పొలార్డ్, మ్యాక్స్ వెల్ వంటి టీ20 స్పెషలిస్టులు కాకుండా పెద్దగా పేరు లేని, అంతర్జాతీయంగా పెద్దగా అనుభవం లేని కేరళ కుర్రాడు సంజు శాంసన్ చేయడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కు సెంచరీ సాయంతో సంజు శాంసన్ భారీ స్కోరు అందించాడు. కేవలం 63 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సంజు శాంసన్ 102 పరుగులు సాధించి, ఆడమ్ జంపా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

దీంతో ఆదిత్య తారే (0), బిల్లింగ్స్ (24), రిషబ్ పంత్ (31), క్రిస్ మోరిస్ (38) తో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 భారీ స్కోరు చేసింది. పూణే బౌలర్లలో చాహర్, తాహిర్, జంపా చెరొక వికెట్ తీశారు. అనంతరం 206 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పూణే సూపర్ జెయింట్ కెప్టెన్ అజింక్యా రహానే (10) వికెట్ ఆదిలోనే కోల్పోయింది. 

  • Loading...

More Telugu News