: ఏపీకి చుట్టపుచూపుగా వస్తున్న జగన్: మంత్రి కాల్వ శ్రీనివాసులు
బెంగళూరు, హైదరాబాద్ లో ఉంటున్న ప్రతిపక్ష నేత జగన్ ఏపీకి చుట్టపుచూపుగా వస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అనకాపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాజ్ భవన్ సాక్షిగా ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ అన్నందుకే, తన పార్టీలోని ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారన్నారు. ప్రగతి విధ్వంసకర శక్తిగా వైఎస్సార్సీపీ మారిందని, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. విశాఖపట్టణం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ వస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.