: కెప్టెన్ స్మిత్ ఆడలేదు, ధోనీకి ఛాన్స్ ఇవ్వలేదు... అందుకే సాక్షి ఆ ట్వీట్ చేసిందా?
ఐపీఎల్ సీజన్ 10లో పూణే జట్టు యాజమాన్యంపై దోనీ భార్య ట్విట్టర్ సాక్షిగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కారణం ఇప్పటికి బోధపడింది. పూణే జట్టు యాజమాన్యం టోర్నీకి ముందు ధోనీకి మాట మాత్రమైనా చెప్పకుండా కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతని స్థానంలో స్మిత్ ను కెప్టెన్ గా చేసింది. నేడు మ్యాచ్ కు ముందు కెప్టెన్ స్మిత్ కడుపునొప్పితో బాధపడుతూ మ్యాచ్ లో పాల్గొనేందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నానికి స్మిత్ ఆరోగ్యపరిస్థితిపై క్లారిటీ వచ్చింది.
ఈ నేపథ్యంలో జట్టులో ఉన్న, అనుభవం కలిగిన మాజీ కెప్టెన్ ధోనీకి తాత్కాలిక కెప్టెన్సీ అప్పగించాలి. కానీ, పూణే యాజమాన్యం అలా చేయకుండా ఈ మధ్య ఆసీస్ తో టెస్టులో భారత్ ను విజయపథాన నడిపిన సారధి అజింక్యా రహానేను కెప్టెన్ ను చేసింది. ఈ విషయాన్ని ధోని తన భార్య సాక్షికి చెప్పి ఉంటాడు. దీంతో యాజమాన్యానికి ట్విట్టర్ ద్వారా సూక్తులు చెప్పింది. టైం గురించి హితబోధ చేసింది.