: అర్ధ సెంచరీ సాధించిన సంజు శాంసన్...ఆకట్టుకున్న రిషబ్ పంత్


ఐపీఎల్ సీజన్ 10లో భాగంగా పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాళ్లు బ్యాటింగ్ లో ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ఆదిలోనే చాహర్ షాక్ ఇచ్చాడు. కేవలం రెండు పరుగుల వద్ద ఓపెనర్ తారే ను డక్కౌట్ చేశాడు. అనంతరం మరో ఓపెనర్ బిల్లింగ్స్ (24) జాగ్రత్తగా ఆడాడు. బిల్లింగ్స్ కు జత కలిసిన సంజు శాంసన్ (62) దూకుడు పెంచి స్వేచ్ఛగా ఆడాడు. బిల్లింగ్స్ అవుటైనా, రిషబ్ పంత్ తో కలిసి ఆడి 6 ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ చేశాడు. మరో వైపు రిషబ్ పంత్ (31) కూడా బ్యాటు ఝళిపించాడు. దీంతో 15.2 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. పూణే బౌలర్లలో తాహిర్, చాహర్ చెరొక వికెట్ తీయగా, రిషబ్ పంత్ రనౌట్ అయ్యాడు. 

  • Loading...

More Telugu News