: దొంగల పార్టీ, రౌడీల పార్టీ, నేరస్థుల పార్టీ...!: వైఎస్సార్సీపీపై చంద్రబాబు మండిపాటు


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరోక్షంగా వైఎస్సార్సీపీ పై మండిపడ్డారు. ‘దొంగల పార్టీ, రౌడీల పార్టీ, నేరస్థుల పార్టీ. ఆ పార్టీ నేతల పనే నేరాలు, మోసాలు చేస్తుండటం’ అని విమర్శలు గుప్పించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని ఎక్కడికక్కడ దోచుకున్నారని, వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని, తమ అక్రమాస్తులకు లెక్కచెప్పలేక.. అధికార పార్టీపైనే ఎదురు దాడికి దిగుతున్నారంటూ అనకాపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మనల్ని దగా చేసిందని, ఆ పార్టీని భూ స్థాపితం చేయాలని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం దీక్షతో పనిచేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News