: హీరో ధనుష్ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన మద్రాసు హైకోర్టు


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ తమ కుమారుడేనంటూ వేసిన పిటిషన్ పై తీర్పును మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ రిజర్వ్ చేసింది. కదిరేశన్ దంపతులు కోర్టుకు సమర్పించిన పత్రాలు, ధనుష్ తరపున దాఖలు చేసిన పత్రాలను కోర్టు పరిశీలించింది. ఈ కేసును కొట్టివేయాలని ధనుష్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు విన్నమధురై బెంచ్ ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

కాగా, ధనుష్ తమ కుమారుడేనంటూ కదిరేశన్, మీనాక్షి దంపతులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ చదువుతున్న సమయంలో ధనుష్ ఇంటి నుంచి పారిపోయి చెన్నై వెళ్లిపోయాడని, 2002లో ధనుష్ గా పేరు మార్చుకున్నాడని కదిరేశన్ దంపతులు గతంలో కోర్టుకు విన్నవించారు. అయితే, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని ధనుష్ కొట్టిపారేశాడు. కస్తూరి రాజా తన అసలు తండ్రి అని, తన నుంచి డబ్బులు గుంజేందుకే కదిరేశన్ దంపతులు ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు.

  • Loading...

More Telugu News