: పశ్చిమ బెంగాల్ లో బీర్భూమ్ లో ఉద్రిక్తత... హనుమాన్ శోభయాత్ర భక్తులపై విరిగిన లాఠీలు
పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీర్భూమ్ లో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తులు శోభాయాత్ర చేపట్టారు. అయితే రంగప్రవేశం చేసిన పోలీసులు, శోభాయాత్రకు అనుమతి లేదని వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శోభాయాత్ర నిర్వహించాల్సిందేనని ఓపక్క భక్తులు, అందుకు అనుమతిలేదని మరోపక్క పోలీసులు బీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరగడంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఒక్కో భక్తుడ్ని లక్ష్యం చేసుకుని పోలీసులు లాఠీ దాడులకు పాల్పడ్డారు. పారిపోతున్న భక్తులను కూడా వదల్లేదు. దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.