: ఎట్టకేలకు సోనాలి బింద్రే కారు దొరికింది!


దొంగలు ఎత్తుకు పోయిన బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే కారును ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లోని ఓ స్మగ్లరు వద్ద ఈ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది అక్టోబర్ 1న ముంబయిలో సోనాలి బింద్రే కు చెందిన ఇన్నోవా కారును గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. ఈ సంఘటన జరిగిన మర్నాడే ఆమె భర్త గోల్డీ బెహల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత ఏడాది నవంబర్ లో రాజస్థాన్ లోని బార్మర్ ప్రాంతంలో ఓ కారును గుర్తించారు. డ్రగ్స్ అక్రమంగా సరఫరా చేసే స్మగ్లర్ నుంచి ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు యజమాని విషయమై దర్యాప్తు చేయగా, ఆ కారు సోనాలి బింద్రేదని తేలిందన్నారు. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాదికి తెలియజేయగా, కోర్టు ద్వారా ఆ కారును తీసుకువెళ్లారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News