: భద్రాచలం, కొత్తగూడెంలలో అధిక ఉష్ణోగ్రతల నమోదు!


తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సూర్యుడి ప్రతాపానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా, భద్రాచలం, కొత్తగూడెంలో ఈ రోజు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం, కొత్తగూడెంలలో ఈ రోజు 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో, మధ్యాహ్న సమయం నుంచి రోడ్లపై జన సంచారం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నెలలో ఎండలను ఎలా తట్టుకోగలుగుతామంటూ ఆయా ప్రాంతాల్లోని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News