: ఇంటి పేరు మార్చుకుందని భార్యపై పగబట్టిన భర్త ఏంచేశాడో చూడండి!
రష్యాలోని మాస్కోలో వెనియ్ అనే సూపర్ మార్కెట్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే తమ ఇంటి పేరు మార్చుకుని, అధికారికంగా తమ సూపర్ మార్కెట్ పేరు పెట్టుకుంటారో వారికి ప్రతినెలా 50,000 రూబెల్స్ (మన కరెన్సీలో 56,000 రూపాయలు) ఇస్తామని ప్రకటించింది. ఇది తెలుసుకున్న ఓ ఇల్లాలు ఇంటికి వచ్చిన భర్తతో తాను ఇంటిపేరు మార్చుకోవాలని భావిస్తున్నానని తెలిపింది. దీనికి ఆమె భర్త అభ్యంతరం తెలిపాడు.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగాయి. దీంతో నీతో ఇక కలిసి ఉండాల్సిన అవసరం లేదంటూ భార్య దురుసుగా సమాధానం చెప్పింది. దాంతో కుతకుతలాడిపోయిన భర్త.... భార్యకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని భావించాడు. వెంటనే ఒక సిమెంటు ట్రక్కును రప్పించి, తన భార్యకు ఎంతో ఇష్టమైన ఆమె కారు నిండా కాంక్రీట్ ను నింపేశాడు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అయింది. మీరు కూడా చూడండి!