: గోపాలపట్నం ఏపీ ఈపీడీసీఎల్ గోడౌన్ లో ఎగసిపడుతున్న మంటలు
విశాఖపట్టణంలోని గోపాలపట్నంలో గల ఏపీఈపీడీసీఎల్ గోడౌన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు కమ్ముకుని అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో భయాందోళనలకు గురైన సిబ్బంది, కార్మికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో నాలుగు ఫైరింజన్లు సంఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. అయినప్పటికీ అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.