: శరత్ కుమార్ చర్య రాధికను ఇబ్బంది పెట్టిందా?


ప్రముఖ కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ చేసిన పని ఆయన భార్య, సినీ నటి రాధికను ఇబ్బందుల్లోకి నెట్టిందా? అంటే ప్రస్తుతానికి అవుననే తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాట అధికారంలో ఉన్న శశికళ వర్గానికి కోలీవుడ్ నుంచి పెద్దగా మద్దతు లేదన్నది తమిళనాడు ఎరిగిన సత్యం. ఈ నేపథ్యంలో దివంగత జయలలిత అసెంబ్లీ స్థానం ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో దినకరన్ కు శరత్ కుమార్ మద్దతు పలికాడు. అంతటితో ఆగకుండా నేరుగా ఆర్కేనగర్ వెళ్లి మరీ కలిసి మద్దతిచ్చాడు.

ఆ మరుసటి రోజే శరత్ కుమార్ నివాసంపై ఐటీ దాడులు జరిగాయి. అతనితో పాటు మంత్రి విజయభాస్కర్ నివాసంపై కూడా ఐటీశాఖ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో రాధికకు సంబంధించిన రాడాన్ టీవీ చానెల్ లో కూడా ఐటీ దాడులు చేసింది. ఈ దాడుల వెనుక కారణం ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో ధనప్రవాహం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ చేసిన పని రాధికను ఇబ్బందుల్లో పడేసిందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News