: సూపర్ మార్కెట్ ప్రిడ్జ్ లో 12 అడుగుల పాము.. వణికిపోయి కేకలు పెట్టిన కస్టమర్!
సూపర్‌మార్కెట్ లో వస్తువులు కొనుక్కునేందుకు వచ్చిన ఓ కస్టమర్ ప్రిడ్జ్ తెరవగానే అందులో 12 అడుగుల కొండచిలువ కనిపించింది. భయంతో వణికిపోయిన ఆ కస్టమర్ దూరంగా పరుగులు తీసింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు చూస్తే... ఓ మహిళ పాలు, పెరుగు తీసుకుందామని సూపర్ మార్కెట్‌కి వచ్చి ప్రిడ్జ్ తెరిచింది. ప్రిడ్జులో ఓ వస్తువును పట్టుకున్న ఆమె... తాను పట్టుకున్నది అది పెద్ద పామునని మరుక్షణంలోనే గుర్తించింది.
వెంటనే కేకలు పెట్టడంతో ఈ విషయం సూపర్ మార్కెట్ సిబ్బందికి తెలిసింది. అక్కడకు చేరుకున్న పాములు పట్టుకునే వారు దాన్ని పట్టుకునేందుకు ఫ్రిడ్జ్‌లో ఉన్న అన్ని వస్తువులను బయటకు తీశారు. అనంతరం కొండచిలువను పట్టుకొని నేషనల్ పార్క్‌లో వదిలేశారు. ఆ పాము సూపర్ మార్కెట్లోకి రూఫ్ లేక డ్రైనేజీ ద్వారా ఫ్రిడ్జ్ వద్దకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.