: దూసుకుపోయిన ఐటీ, రియాల్టీ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ షేర్లు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఐటీ, రియాల్టీ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ షేర్ల కొనుగోళ్ల మద్దతుతో లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 213 పాయింట్లు లాభపడి 29,788 వద్ద ముగిసింది. నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 9,237 వద్ద క్లోజ్ అయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (13.02%), కర్ణాటక బ్యాంక్ (9.00%), ట్యూబ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఆఫ్ ఇండియా (7.94%), నెట్ వర్క్ 18 మీడియా (7.75%), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (7.48%).
టాప్ లూజర్స్...
అదానీ పవర్ (-16.12%), అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ (-9.92%), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ (-4.78%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.50%), రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (-2.03%).