: ముస్లిం నాయకుల ఎదుట సిగరెట్‌ కాల్చే ధైర్యం చేయనందుకు చైనాలో ఓ ఉద్యోగి డిమోట్‌


తీవ్రమైన మత ఆలోచనలకు ప్రతీకగా చైనాలో చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముస్లింలు ఎక‍్కువగా ఉండే జింజియాంగ్‌ రాష్ట్రంలో స్థానిక మతాచారాల ప్రకారం పెద్దలు లేక‌ మతపెద్దల ఎదురుగా సిగరెట్లు కాల్చకూడద‌ని భావిస్తారు. అయితే, స్థానిక ముస్లిం నాయకుల ఎదుట సిగరెట్‌ కాల్చే ధైర్యం చేయనందుకు చైనాలో ఓ ఉద్యోగి తాను చేస్తోన్న పై స్థాయి హోదా నుంచి డిమోట్‌ అయ్యాడు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన జెలిల్ మ‌త్నియాజ్.. హోటన్‌ నగరం సమీపంలోని ఒక గ్రామానికి పార్టీ చీఫ్‌గా ఉన్నారు. అయితే, ముస్లిం నాయ‌కుల‌ ముందు సిగ‌రెట్ కాల్చ‌నందుకు ఆయ‌న‌ను కమ్యూనిస్ట్ పార్టీలో ‘సీనియర్‌ స్టాఫ్‌ మెంబర్‌’ నుంచి ’స్టాఫ్‌ మెంబర్‌’ గా డిమోట్‌ చేశారు.

  • Loading...

More Telugu News