: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం సరికాదు: ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇతర కారణాలు చెప్పడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. రాజ్యసభలో ఈ రోజు జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయని అన్నారు. ప్రత్యేక హోదా విషయమై ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పునర్విభజన కారణంగా హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందని సుబ్బరామిరెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News