: విద్యుత్ పై కీలక నిర్ణయం తీసుకున్న యోగి కేబినెట్


పలు కీలక నిర్ణయాలతో పాలనలో దూసుకుపోతున్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పాలనా వ్యవహారాలపై ఆయన కేబినెట్ క్రమంగా పట్టు సాధిస్తోంది. ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో విద్యుత్ సరఫరాపై నిర్ణయం అత్యంత కీలకమైనది. జిల్లా కేంద్రాల్లో 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మండలాలు, బుందేల్ ఖండ్ పరిధిలో 20 గంటల పాటు, గ్రామాల్లో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి శ్రీకాంత్ శర్మ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News