: ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదు కానీ, 'స్పెషల్ కేటగిరీ స్టేట్'గా పరిగణిస్తున్నాం!: కేంద్ర మంత్రి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై చర్చ జరిగిన సందర్భంగా మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సమాధానమిస్తూ, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా...ఏపీని స్పెషల్ కేటగిరీ స్టేట్ అంటున్నామని తెలిపారు. ఉత్తరాఖండ్ తరువాత మరే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. నీతి ఆయోగ్ అమల్లోకి రాకముందు దేశంలో 11  రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఉందని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదా రావాలంటే ఎన్డీసీ అనుమతి తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేకహోదాను ఎన్డీసీ ఆమోదించలేదని ఆయన తెలిపారు. అందుకే ఏపీని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా పరిగణిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రాలకు అదనంగా పది శాతం నిధులిస్తున్నామని ఆయన తెలిపారు. అందువల్ల ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News