: కాటేసిన పామును చేత్తో పట్టుకుని ఆసుపత్రికి వచ్చాడు!
తనను కాటేసిన పామును చేత్తో పట్టుకుని ఓ వ్యక్తి ఆసుపత్రికి రావడంతో అక్కడున్న నర్సులందరూ పరుగులు తీసిన ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం చిట్రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికంగా రమణ (50) అనే వ్యక్తి కూలిపనులు చేస్తుంటాడు. మరోవైపు పాములను కూడా పడతాడు. ఇప్పటివరకకు 300కుపైగా పాములను పట్టాడు. ఈ క్రమంలో, రామకృష్ణ అనే వ్యక్తి తన ఇంట్లోకి నాగుపాము వచ్చిందని, దాన్ని పట్టాలని రమణను పిలిచాడు. అయితే, దాన్ని పట్టుకునే క్రమంలో ఒక్కసారిగా అది కాటు వేసింది. దీంతో ఆ పాము నోటిని గట్టిగా పట్టేసి అలాగే దాన్ని తీసుకుని, ఆసుపత్రికి వెళ్లాడు. ఆయన చేతిలో పామును చూసి దూరంగా పారిపోయిన నర్సులు అనంతరం తేరుకొని అతడికి వైద్యం చేశారు.