: మంత్రి హోదాలో కర్నూల్ కు తొలిసారి వెళ్లిన అఖిల ప్రియ..ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు


నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థి విషయమై తన కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. అఖిల ప్రియ మంత్రి పదవి చేపట్టిన అనంతరం తొలిసారిగా కర్నూలు నగరానికి ఈ రోజు వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి స్టేట్ గెస్ట్ హౌస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం, టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్నిప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, నేతల సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటు పడతానని చెప్పారు. 

  • Loading...

More Telugu News