: 2 బంతుల్లో 18 పరుగుల్ని రాబట్టిన మనీష్ పాండే!
ఐపీఎల్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ చోటు చేసుకుంది. కేవలం రెండు బంతుల్లో 18 రన్లను నైట్ రైడర్స్ సాధించింది. ముంబై ఇండియన్స్ బౌలర్ మెక్లెనగన్ వేసిన ఓ ఓవర్ రెండు బంతుల్లో 18 పరుగులు లభించాయి. ఇది ఎలా సాధ్యమైందో చూద్దాం.
మెక్లెనగన్ వేసిన తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టాడు మనీష్ పాండే. ఆ తర్వాత బంతిని బౌండరీకి తరలించాడు. ఈ బంతి నో బాల్ కావడంతో, అదనంగా మరో బంతి వేయాల్సి వచ్చింది. ఈ బంతిని అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. ఆ తర్వాత వేసిన ఎక్స్ ట్రా బాల్ ను మళ్లీ భారీ సిక్సర్ గా మలిచాడు పాండే. దీంతో, రెండు బంతుల్లోనే 6+5+1+6=18 పరుగులు వచ్చాయి.