: ఏపీలో లక్ష ఐటీ ఉద్యోగాలు: నారా లోకేష్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలను సృష్టిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడలో ఈ రోజు ఆయన కేజే సిస్టమ్స్ విస్తరణ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సెంటర్ ఏర్పాటు వల్ల ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో మాన్యుఫాక్చరింగ్ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. వంద రోజుల్లో రాష్ట్రానికి మంచి మంచి కంపెనీలు రాబోతున్నట్టు చెప్పారు. చిన్న కంపెనీల ద్వారానే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News